Wednesday, December 4, 2024

AP – మ‌రికొద్దిసేప‌ట్లో చంద్ర‌బాబుతో ప‌వ‌న్ భేటి

అమరావ‌తి – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. నేటి మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం చంద్రబాబుతో ఆయన నివాసంలో భేటీ కానున్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు, పలు ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక క్యాంప్ కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయాల పునర్ వ్యవస్థీకరణపై సమీక్ష చేయ‌నున్నారు చంద్ర‌బాబు.. అలాగే సిఆర్డీఎ అధికారుల‌తో సిఎం స‌మావేశం కానున్నారు.

రేపే క్యాబినేట్ భేటి

కాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఒక రోజు ముందే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 4న ఈ భేటీ జరగాలి. తాజాగా మంగళవారం జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 3వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరుగుతుందని.. అధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి.. జీఏడీకి పంపించాలని ఆదేశించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement