ఢిల్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ఒప్పందం అనంతరం జనసేన, బీజేపీ అభ్యర్థులు ఏయే స్థానాల్లో పోటీ చేస్తారో అంచనా వచ్చింది. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ ఏ అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తారో ప్రకటించక పోవటంతో.. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని కొత్త జాబితాలో ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది.
బీజేపీ, జనసేన నుంచి ఎంపీ అభ్యర్థులుగా ఈ జాబితా సమాచారం ప్రకారం, కాకినాడ ఎంపీ స్థానంలో పవణ్ కళ్యాణ్ , మచిలీ పట్నంలో వల్లభనేని బాలశౌరి జన సేన నుంచి పోటీ చేయనున్నారు. రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి నుంచి పురందరేశ్వరి, ఏలూరు నుంచి సుజనా చౌదరి, నరసాపురం నుంచి రఘురామ కృష్ణరాజు, అనకాపల్లి నుంచి సీఎం రమేశ్ బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. ఇక…హిందూపురం లేదా అరుకు విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.