Tuesday, December 3, 2024

AP – పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్… పించన్ లు పంపిణీ చేయనున్న జన సేనాని

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ నేటి నుంచి మూడు రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో తొలిసారి పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.

ఈ నేపథ్యం లో నేటి ఉదయం 7.30 గంటలకు విమానం లో రాజమండ్రికి చేరు కున్నారు. ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా పిఠాపురం బయలుదేరారు..ఇక గొల్లప్రోలు సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సామాజిక. ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు . లబ్ధి దారులకు పెన్షన్ లు స్వయంగా పవన్ అందజేస్తారు

- Advertisement -

మధ్యాహ్నం చేబ్రోలు నివాసంలో పిఠాపురం జనసేన నేతలతో భేటీ కానున్నారు

2వ తేదీన కాకినాడ కలెక్టరేట్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పంచాయితీ, అటవీ కీలక శాఖలపై సమీక్ష చేపట్టనున్నారు. మధ్యాహ్నం జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కీలక భేటీ నిర్వహించనున్నారు. జులై 3న ఉప్పాడ, యు.కొత్తపల్లిలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం టీడీపీ, బీజేపీ కీలక నేతలతో భేటీ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పిఠాపురంలో వారాహి బహిరంగ సభలో పాల్గొననున్నారు. తర్వాత హెలికాప్టర్‌లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ విజయవాడ తిరుగు ప్రయాణం కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement