Wednesday, October 30, 2024

AP – తొలిసారి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ప్రమాణం

దటిసారిగా అసెంబ్లీలో ప్రమాణం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాసేపటి క్రితమే ఏపీ అసెంబ్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అనంతరం మొదటిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేశారు.

మొదటగా సీఎం చంద్రబాబు ప్రమాణం చేయగా.. ఆ తర్వాత మొదటిసారిగా అసెంబ్లీలో ప్రమాణం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

కాగా, ఏపీ శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం 9.46 గంటలకు ప్రారంభం అయ్యాయి. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు సభలోకి అడుగుపెట్టారు. మొదట ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లిన ఆయన సగౌరవంగా గౌరవ సభలోకి అడుగుపెట్టారు. మొదటగా సభ్యులంతా జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ప్రొటెం స్పీకర్‌ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేశారు. ఆ తర్వాత సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి రిజిస్టర్లలో సంతకాలు చేశారు..

- Advertisement -

సభకు హాజరైన జగన్

ఇది ఇలావుంటే మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్‌ ప్రమాణ స్వీకారానికి అనుమతించాలని, ఆయన కారును కూడా లోపలికి అనుమతించాలంటూ వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థనకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.ఈ విషయాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఈ రోజు వరకు జగన్ కారును లోపలికి అనుమతించాలని నిర్ణయించారు. అలాగే, మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్‌తో ప్రమాణ స్వీకారానికి ఓకే చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement