అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నారు.. ఫీవర్ తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. యితే, అస్వస్థతతో ఉన్నప్పటికీ నేడు తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు..
వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు పవన్ . పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోతే అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు.. దోమల బెడద తీవ్రత ఉన్నందున.. పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం చేశారు.. మరోవైపు.. స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని దిశానిర్దేశం చేశారు.
అనంతరం ఏలేరు రిజర్వాయర్ కి వరద ముప్పుపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు.. ప్రస్తుతం డిప్యూటీ సీఎం వైద్యుల సూచనలు తీసుకొంటున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు సైతం వైరల్ ఫీవర్‌తో ఇబ్బందిపడుతున్నట్లు సమాచారం..