Friday, December 20, 2024

AP – విశాఖ నుంచి సాలూరు పర్యటనకు బయలుదేరిన పవన్ కళ్యాణ్

విశాఖ – ‍ ‍‍‍ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ క్షేత్రస్థాయిలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. నేడు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. గతరాత్రి ఈ పర్యటన కోసం గన్నవరం నుంచి విమానంలో విశాఖపట్నం చేరుకున్నారు

ఇక నేటి ఉదయం పార్వతీపురం మన్యం జిలా పర్యటనకి విశాఖ నుంచి బయలుదేరారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా ముందుగా నిర్ణయించుకు ప్రకారం – గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ పర్యటనకి బయలు దేరారు.

ముందుగా ఆయన సాలూరు నియోజకవర్గం పనసభద్ర పంచాయతీ బాగుజోలకు వెళ్తారు. మన్యం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. .

19 నూతన రోడ్లకు శంకుస్థాపనలు

- Advertisement -

దాదాపు 36.71 కోట్ల వ్యయంతో, 39.32 కి.మీ. మేర నూతన రోడ్ల నిర్మాణం పనులను పవన్ ప్రారంభిస్తారు. రోడ్ల నిర్మాణంతో 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి డొలీల బాధల నుండి విముక్తి కలుగనుంది.

అక్కడ‌ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారు. అనంతరం అక్కడ గిగిజనులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు.. ఆ కార్యక్రమాలను ముగించుకొని తిరిగి సాయంత్రానికి విశాఖ చేరుకుంటారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement