ఎపి ప్రపంచ రికార్డు
పవన్ కు వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ అందజేత
అమరావతి: ఉప ముఖ్యమంత్రి గా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డ్ సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ప్రపంచ రికార్డ్ దక్కింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభలను వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది.
ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్ ను హైదరాబాద్ లోని పవన్ నివాసంలో ఈ రోజు ఉదయం జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాన్ కి వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ వరల్డ్ రికార్డ్ దృవీకరణ పత్రాన్ని అందచేశారు.
ఈ సందర్బంగా వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి క్రిస్టఫర్ టేలర్ మాట్లాడుతూ, ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు చెప్పారు.. పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప వంద రోజులలోనే పవన్ కల్యాణ్ ఈ ఘనత సాధించడం అభినందనీయమని అన్నారు.