Sunday, September 22, 2024

AP | ఏడుకొండలవాడా క్షమించు… పవన్ ప్రాయశ్చిత్త దీక్ష..

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత పాలకుల వికృత పోకడల ఫలితంగా పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమైందని…. అందకు 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడతామని ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎక్స్ వేధికగా ట్వీట్ చేశారు.. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు వికలమైందని.. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే తన దృష్టికి రాకపోవడం బాధించిందన్నారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలసిందేనన్నారు.

అందులో భాగంగా ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీ (ఆదివారం) ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతానన్నారు. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement