Tuesday, October 22, 2024

AP – మ‌రోసారి దాతృత్వం చాటుకున్న ప‌వ‌న్

గుర్ల మృతుల‌కు ఒక్కొక్క‌రికి రూ. ల‌క్ష వ్య‌క్తి గ‌త‌సాయం
ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన న‌ష‌ప‌రిహారానికి ఇది అద‌నం .

విజయనగరం – గుర్ల గ్రామంలో చనిపోయిన ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగతంగా లక్ష రూపాయల అందించనున్న‌ట్లు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు… ప్రభుత్వ నివేదిక వచ్చాక ప్రభుత్వం తరఫున కూడా ఆర్థికంగా ఆదుకుంటామ‌ని పేర్కొన్నారు..
జిల్లాలో అతిసార వ్యాధి ప్రబలడంపై, త్రాగునీరు కలుషితం అంశాలపై విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో నేడు స‌మీక్ష నిర్వ‌హించారు.. అనంత‌రం ప‌వ‌న్ మీడియాతో మాట్లాడుతూ, – విజయనగరం జిల్లా అతిసార ప్ర‌భ‌ల‌డానికి
బహిరంగ మలవిసర్జన కారణమ‌న్నారు.. దీనివ‌ల్ల నీటిని కలుషితమ‌వుతున్నాయ‌ని తెలిపారు.. నీటి కాలుష్యంతో ప్రాణాలు పోవ‌డమే కాకుండా , సామాన్య ప్రజల అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతున్నార‌ని ప‌వ‌న్ అన్నారు. నీరు క‌లుషితం కాకుండా ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ భాద్యతగా వ్య‌వ‌హ‌రించి, ప్ర‌జ‌ల‌కు అవగాహన కల్పించాల‌న్నారు.. అధికారులు, పంచాయతీ సర్పంచ్ లు ఈ భాధ్యత తీసుకోవాలన్నారు..

- Advertisement -

తాము గత ప్రభుత్వాలను విమర్శించడం లేద‌ని అంటూ గత ప్రభుత్వం 5 ఏళ్లలో కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేద‌న్నారు ఉప ముఖ్య‌మంత్రి.. బెడ్స్ మార్చి ఉంటే నీరు కలుషితం అవ్వకుండా ఫిల్టరింగ్ సక్రమంగా జరిగి ఉండేద‌న్నారు. 15 వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు పెట్టిన పనిచేయవచ్చు కదా అని అడిగితే , అధికారులు గతంలో నిధులు రాలేదు అంటున్నార‌న్నారు.,
కేంద్ర ప్రభుత్వం పంచాయతీ, జల్ జీవన్ మిషన్ కోసం నిధులు ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదరి . త్వరలో మరో దాదాపు 650 కోట్లు గ్రామీణ నీటి సరఫరా కోసం కేంద్ర నిధులు రానున్నాయ‌ని ప‌వ‌న్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement