విశాఖపట్నం,ఆంధ్ర ప్రభ బ్యూరో – జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోమవారం అనకాపల్లి నూకాలమ్మను దర్శించుకున్నారు. కూటమి పార్టీ విజయం సాధించాక తొలుత తాను నూకాంబికను దర్శించుకున్నాకే పిఠాపురంలో అడుగు పెడతానని ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పట్లో పవన్ పేర్కొన్నారు. అనుకున్నట్టుగానే ప్రత్యేక విమానంలో పవన్ విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అనంతరం ఆయన అనకాపల్లి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపించి, పవన్ కల్యాణ్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పవన్‌కు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు ఘనంగా స్వాగతం పలికారు.
ఇదిలా ఉంటే తిరుగు ప్రయాణంలో విశాఖలోనూ పవన్ కల్యాణ్‌కు కూటమి నేతలు సాదరంగా స్వాగతం పలికారు. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండానే పవన్ టూర్ సాగింది. పార్టీ నేతల్నీ తనతో రావద్దని ఆయన కోరారు. కార్యక్రమంలో బత్తుల తాతయ్యబాబు, ప్రగడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.