Monday, September 16, 2024

AP – జనసేన కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు

అమ‌రావ‌తి – మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మట్టి గణపతి ప్రతిమకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తొలి పూజలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

. విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో గడపాలని, విజయాలు సిద్ధించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ శ్రీ కల్యాణం శివ శ్రీనివాస్, చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement