Tuesday, November 19, 2024

AP – చంద్ర‌బాబుతో ప‌వ‌న్ భేటీ …హస్తినకు వెళ్లాలని నిర్ణయం ..

రెండో జాబితాపై క‌స‌రత్తు
బీజేపీతో పొత్తుపై సుదీర్ఘ చ‌ర్చ‌లు
క‌మ‌లనాధుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని నిర్ణ‌యం
రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి ప‌య‌నం
ఇప్ప‌టికే ఢిల్లీకి చేని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వ‌రీ
ఏపీలో పొత్తుల‌పై నివేదిక‌.. పార్టీ పెద్ద‌ల‌కు అంద‌జేత
ఇవ్వాలే ఓ క్లారిటీ రానుంద‌ని ఢిల్లీ వ‌ర్గాల నుంచి టాక్‌

టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ బుధ‌వారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప‌వ‌న్‌కు చంద్ర‌బాబు సాద‌ర‌పూర్వ‌క స్వాగ‌తం ప‌లికారు.. అనంత‌రం వీరిద్ద‌రు మలివిడత అభ్యర్థుల ఎంపిక సహా.. వివిధ అంశాలపై దాదాపు గంటన్నర పాటు చర్చించారు. భ‌విష్య‌త్‌లో ఉమ్మ‌డిగా నిర్వ‌హించ‌బోయే స‌భ‌ల‌లో ప్ర‌తిపాద‌న‌లు ఒక‌రికొక‌రు అందించుకున్నారు.

రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి..

ఇదిలా ఉంటే బీజేపీతో పొత్తు విష‌యంలో ఇక ఫైన‌ల్ చేయాల‌ని ఇద్ద‌రు నేత‌లు నిర్ణ‌యించుకున్నారు. దీంతో రానున్న రెండు, మూడు రోజ‌ల్లో చంద్రబాబు, పవన్ క‌లిసి ఢిల్లీ వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిణామాలపై నేతలిద్దరూ చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది.

ఆక‌స్మికంగా పురందేశ్వ‌రీ ఢిల్లీ ప‌య‌నం

- Advertisement -

కాగా, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆక‌స్మికంగా గ‌త రాత్రి ఢిల్లీ వెళ్లారు. బుధ‌వారం నంద్యాల‌లో ఆమె ప‌ర్య‌ట‌న ఉండ‌గా పార్టీ అధిష్టానం నుంచి ఫోన్ రావ‌డంతో ఆ టూర్‌ను క్యాన్సి ల్ చేసుకుని ఢిల్లీ వెళ్లిన‌ట్టు స‌మాచారం. పొత్తులపై బీజేపీ హైకమాండ్‌తో చ‌ర్చించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల పొత్తుల‌పై పార్టీలోని నేత‌ల నుంచి పురందేశ్వ‌రీ అభిప్రాయాల‌ను సేక‌రించారు. ఆ నివేదిక‌తో హ‌స్తిన‌కు వెళ్లిన‌ట్లు స‌మాచారం. నేడు బీజేపీ అధిష్టానంతో జ‌రిపే చ‌ర్చ‌ల‌లో పొత్తుపై క్లారిటీ రావ‌చ్చ‌ని డిల్లీ వ‌ర్గాల‌ నుంచి టాక్ వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement