Friday, January 10, 2025

AP – రోడ్డు ప్ర‌మాదంలో అభిమానులు మృతి – ప్ర‌దేశాన్ని ప‌రిశీలించిన ప‌వ‌న్ క‌ల్యాణ్

రాజ‌మండ్రి – ఇటీవలే రాజ‌మండ్రిలో రాంచ‌ర‌ణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన కాకినాడ-రాజమండ్రి మధ్య ఎడిబి రోడ్డు ప్రమాద స్థలిని జనసేన చీఫ్‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పరిశీలించారు. రాజమండ్రి నుంచి రంగంపేట ఏడీబీ రోడ్డు మీదుగా పిఠాపురం వెళ్తున్న పవన్‌ కల్యాణ్‌ ప్రమాద స్థలం దగ్గర అధికారులతో కలిసి ఆగారు. రోడ్డు మరమ్మతు పనుల గురించి ఆరా తీశారు.

పిఠాపురం పర్యటనకు వెళ్తూ రామస్వామిపేట వద్ద ఏడీబీ రోడ్డు నిర్మాణం పనులు పరిశీలించారు. రోడ్డు నిర్మాణం ఎప్పుడు ప్రారంభం అయ్యింది. ఎంత వరకు పూర్తయ్యింది? ప్రస్తుతం పనులు ఎలా సాగుతున్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు వెంట కాలి నడకన వెళ్తూ డ్రెయిన్ సౌకర్యం, నిర్మాణం పనుల్లో నాణ్యతను పరిశీలించారు. కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి, ఇతర ఉన్నతాధికారులు ఆయన వెంట ఉన్నారు.

- Advertisement -

ఇదిలా ఉండగా.. రాజమహేంద్రవరం శివారున ఈ నెల 4వ తేదీన రాంచరణ్‌ నటించిన గేమ్‌ఛేంజర్‌ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు హాజరై తిరిగివెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కాకినాడకు చెందిన ఎ.మణికంఠ, టి.చరణ్‌ల కుటుంబ సభ్యులను ఇటీవల సినీ నిర్మాత దిల్‌ రాజు తరపున ప్రతినిధుల బృందం పరామర్శించింది. మైత్రి ఫిలింస్‌ తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు ఉదయ్‌రాజు, రాయుడు, లైన్‌ ప్రొడ్యూసర్‌ కాకినాడ బాబీ, సినీ నిర్మాత మల్లిడి సత్యనారాయణరెడ్డి, జనసేన జగ్గంపేట ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి రమేష్‌ తదితరుల చేతుల మీదుగా ఇరు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement