Monday, November 18, 2024

AP – జగన్ గడ్డ నుంచే పవన్ పర్యటన ఫిక్స్

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – అమరావతి – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.ఈ క్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ అడుగు ముందుకేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో కూడా గ్రామసభలను నిర్వహించాలని నిర్ణయించారు.రాష్ట్రంలో మొత్తం 13,326 పంచాయతీలు ఉండగా.. వాటన్నింట్లోనూ ఒకేరోజు ఒకేసారి గ్రామసభలను నిర్వహించేలా పవన్ కల్యాణ్ చర్యలను తీసుకున్నారు.

- Advertisement -

ఈ నెల 23వ తేదీన వాటిని ఏర్పాటు చేయాలంటూ ఇదివరకే అధికార యంత్రాంగ్రాన్ని ఆదేశించారు. దీనికి సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి అవుతున్నాయి. గ్రామసభల్లో చదవాల్సిన నోటీసుల కూడా సిద్ధం అయ్యాయి.

వచ్చే అయిదు సంవత్సరాలలో గ్రామాల్లో 17,500 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లను వేయడం, 10,000 కిలోమీటర్ల మేర మురుగు కాలువలు నిర్మించడం, ప్రతి ఇంటికీ మంచినీరు అందించాలని చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం నిర్దేశించుకుంది.

అలాగే- గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలన్నింటినీ కూడా అక్టోబరు 2వ తేదీ నుంచి పునఃప్రారంభించబోతోంది.ఆయా పనులను గ్రామసభల సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టాల్సిన పనుల ఆమోదం, వేతనాలను కోరే హక్కు, అర్హతల గురించి ప్రజలకు వివరించడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన పనులపై అక్కడికక్కడే సమీక్షించడం వంటివి ఈ గ్రామసభల్లో చర్చిస్తారు.

ఈ గ్రామసభల్లో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. గ్రామసభల ప్రారంభ తేదీ అయిన 23వ తేదీన అన్నమయ్య రాయచోటి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మైసూరావారి పల్లిలో నిర్వహించే గ్రామసభకు హాజరు కానున్నారు. అనంతరం రాజంపేట అన్నమయ్య డ్యాం వరద బాధిత గ్రామమైన పులపుత్తూరుకు వెళ్తారు. బాధిత కుటుంబాలను పలకరిస్తారు

Advertisement

తాజా వార్తలు

Advertisement