- చదరంగంలో 175 ఫజిల్స్ ను నిమిషాలలోనే పూర్తి
- వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో దేవాన్ష్ కు చోటు
- గ్రాండ్ మాస్టర్ గా ఎదగాలంటూ పవన్ పోస్ట్
వెలగపూడి – చదరంగంలో 175 క్లిష్టమైన పజిల్స్ కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేసి సత్తా చాటిన మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. చెస్‌లో మరిన్ని రికార్డులు నెలకొల్పాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా దేవాన్ష్‌ను ప్రశంసించారు పవన్.
కేవలం 11నిమిషాల 59 సెకండ్లలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో దేవాన్ష్ స్థానం సంపాదించారన్నారు. అతి చిన్న వయసులోనే చెస్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని.. భవిష్యత్తులో గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు సామాజిక మాద్యమంలో పవన్ పోస్టు చేశారు.
- Advertisement -