Friday, November 22, 2024

AP: పవన్ కు మతిస్థిమితం లేదు.. చంద్రబాబు స్క్రిప్టు చవడమే ప‌ని.. మంత్రి వెలంపల్లి ఫైర్

విజయవాడ: జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్ కు మతిస్థిమితం లేదని, టీడీపీ అధినేత చంద్రబాబు ఏమి చెబితే అదే చదవటం ప‌నిగా పెట్టుకున్నార‌ని ఫైర్ అయ్యారు మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్‌. విశాఖ ఉక్కు పరిశ్రమపై బీజీపై పై ఢిల్లీలో ప్రశ్నించకుండా గల్లీలో ఈ వేషాలు ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా సొమరంగ్ చౌక్ లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పులమాల వేసి నివాళ్లు అర్పించిన త‌ర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా వెలంప‌ల్లి మాట్లాడుతూ.. ప‌వన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నాడని, విశాఖ ఉక్కు పై కేంద్రం తీసుకున్న నిర్ణయన్ని ఎందుకు మాట్లాడంలేదన్నారు. విశాఖ ఉక్కు ప్రవేటికరణ వద్దు అంటు అసెంబ్లీలో సీఎం జగన్ ఆమోదం చేశారని మంత్రి తెలిపారు. చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ ను పవన్ చదువుతున్నాడని, జనసేన నాయకులు ఢిల్లీలో ధర్నా చేయలేక విశాఖ గల్లీలో ధర్నా చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. బిజెపితో మాట్లాడే దమ్ము, ధైర్యం పవన్ కళ్యాణ్ కు లేదని దెప్పిపొడిచారు. పాచిపోయిన లడ్డూలు అని మోడీపై పవన్ కళ్యాణ్ గతంలో విమర్శలు చేశారు కదా.. మ‌రి అవి ఇప్పుడు బంగారు ల‌డ్డూలు అయ్యాయా అని ప్ర‌శ్నించారు.

సినిమాలో వకిల్ సాబ్, గబ్బర్ సింగ్ కావచ్చు కానీ రాజకీయ జీవితంలో పసలేని నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. ఈ సంద‌ర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆర్యవైశ్య అధ్యక్షుడు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనక్కళ్ల విద్యాధరరావు, ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు, కార్పొరేటర్లు మండేపూడి చటర్జి, నరేంద్ర రాఘవ, మహాదేవ్ అప్పాజీ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement