Monday, July 1, 2024

AP – ఎన్నిక‌లలో విధుల నిర్వ‌హించిన సిబ్బందికి ఒక నెల జీతం బోన‌స్

ఇటీవల దేశంలో సార్వత్రిక ఎన్నికలు-2024 విజయవంతంగా ముగిశాయి. ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో, సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక నెల గౌరవ వేతనం ప్రకటించింది. ఒక నెల గరిష్ఠ వేతనానికి సమానంగా గౌరవ వేతనం చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా జిల్లాల కలెక్టర్లకు ఆ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement