Friday, November 22, 2024

AP – శ్రీశైలం క్రస్ట్ గేట్ కు సాంకేతిక లోపం

(ఆంధ్రప్రభ స్మార్ట్, నంద్యాల ప్రతినిధి)
శ్రీశైలం ప్రాజెక్టు మూడవ క్రస్ట్ గెట్ మోటార్ ప్యానెల్ కు సాంకేతిక లోపం ఏర్పడింది . మూడో నెంబర్ గేటు మోటర్ ప్యానెల్ బ్రేక్ కాయల్ కాలిపోయింది. వరద ప్రవాహం పెరగటంతో గేట్లను పైకి లేపుతుండగా ఈ ఘటన నెలకొందని సమాచారం. ఇంజనీరింగ్ అధికారులు అప్రమత్తం అయ్యారు. సాంకేతిక లోపాన్ని సర్దించేందుకు మరమత్తులు చేయటంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఇప్పటికే తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయి, నీరు అంతా కిందికి వెళ్ళిపోయి చాలా ప్రమాద స్థాయికి చేరుకుంది. ఈ డ్యామ్ క్రస్ట్ గేటు రిపేరు చేయటంతో ప్రజలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన జూరాల, ఆల్మట్టి డ్యామ్ ల నుంచి 4,90,713 క్యూసెక్కుల నీరు శ్రీశైలం చేరుతోంది. ప్రస్తుతం డ్యామ్ లో నీటి మట్టం 884.60 అడుగుల మేరకు చేరుకుంది. . డ్యాములో 213.4011 టీఎంసీల నీరు ఉంది. 8 గేట్ల ద్వారా 18 అడుగుల మేర ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఎడమ ప్రాంతంలో నీరు అధికంగా వస్తుండటంతో గేట్లను 18 అడుగుల మేర ఎత్తినట్లు అధికారులు తెలుపుతున్నారు. మిగిలిన రెండు గేట్లను ఎత్తకపోవడంతో పలు అనుమానాలు తావిస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement