విజయవాడ, ఆంధ్రప్రభ – ఎన్నెన్నో జన్మల బంధం అంటూ స్నేహగీతిక సుస్వరంతో ఆలపించారు. సింగారాల పైరుల్లోన బంగారాలే పండాలంట అంటూ జోష్ నింపారు. అతను గాయకుడు కాదు..కానీ వారితో గొంతు కలిపి ప్రేక్షకులను మంత్రముగ్దులు చేశారు.
సిద్ధార్థ కళాశాల ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ సరదాగా పాటలు పాడి సంగీతాభిమానులను అలరించారు. నిత్యం సమీక్షలు, క్షేత్రస్థాయి సందర్శనలు, ప్రజల నుండి వచ్చే సమస్యలకు పరిష్కారం ఇలా ప్రతిరోజు బిజీగా ఉండే జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ నూతన సంవత్సరం వేళ తన అద్భుత గానంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
దాశరథి మణి గీత మాలికలో నేను సైతం అంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గొంతు కలిపి పాటలు పాడారు. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా దళపతి లోని సింగారాల పైరుల్లోన బంగారాలే పండాలంట అనే పాటతోపాటు మరో పాత సూపర్ హిట్ పాట ఎన్నెన్నో జన్మల బంధం నీది.. నాది అనే పాటలు పూర్తిగా పాడి అలరించారు. పాటలు వినాలని వచ్చిన కలెక్టర్ శ అక్కడి వేదికపై గాయకుల ఆలాపన, శ్రోతల సందడి చూసి ఆయన కూడా మైక్ అందుకుని స్వరం కలిపారు. కలెక్టర్ లక్ష్మీ శ పాటలకు నిర్వాహకులు, ప్రేక్షకులు సంగీత అభిమానులు మంత్రముగ్ధులయ్యారు.