Monday, November 11, 2024

AP – రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే కఠినంగా అణచివేస్తాం – చంద్రబాబు

విజయవాడ – రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే కఠినంగా అణచివేస్తామని సిఎం చంద్ర బాబు హెచ్చరించారు. నే రాలు చేసే వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని.. పోలీస్ లను ఆదేశించారు.

పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నేడు విజయవాడలో జరిగిన కార్యాక్రమంలో పాల్గొని అమరులైన పోలీసులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , పోలీసుల సంక్షేమమే మా ప్రభుత్వం బాధ్యత అన్నారు. శాంతి భద్రతలు కాపాడటం లో రాజీలేదు. రాష్ట్ర విభజన తరువాత పోలీసుల్లో మార్పులు తీసుకొచ్చాం. ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజాన్ని ఉక్కుపాదాన్ని అణచివేశారు. పోలీసులు పాత టెక్నాలజీని వాడుకుంటే.. నేరస్తులను ఎదుర్కొలేరు. అందుకే కొత్త ఆయుదాలు సమకూరుస్తున్నాం. 14వేల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

- Advertisement -

గత ప్రభుత్వం సీసీ కెమెరాల కోసం 700 కోట్లు ఇవ్వలేకపోయింది. అవి ఇచ్చి ఉంటే.. రాష్ట్రంలో ఈ అఘాయిత్యాలు జరిగేవి కాదు అన్నారు సీఎం చంద్రబాబు. అప్పులు, వడ్డీలు చెల్లించాలి. పోలీసులందరికీ విజ ప్తి.. నేరాల తీరు మారుతుంది. టెక్నాలజీ పెరిగిన కొద్ది సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. వాళ్ల కంటే మెరుగ్గా చేస్తే.. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలుగుతాం. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారు చాలా మంది ఉన్నారని తెలిపారు చంద్రబాబు.

Advertisement

తాజా వార్తలు

Advertisement