అమరావతి ,- ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ గ్రామ, వార్డు వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న దృష్ట్యా వాలంటీర్లను అన్నిరకాల ఎన్నికల విధుల నుంచి తక్షణమే తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ప్రక్రియలో పాల్గొన్నా ఈసీ మార్గదర్శకాల ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. పోలింగ్ ఏజెంట్లుగా ఉండేందుకు కూడా అర్హులు కారని పేర్కొంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.