Friday, November 8, 2024

AP – పేరుకే జగన్ రాయలసీమ బిడ్డ – ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యం చేసింది ఆ ఘనుడే – నిమ్మల

ఆంధ్రప్రభ స్మార్ట్, కర్నూలు బ్యూరో ( నందికొట్కూరు)తాను రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డికి నైతిక విలువ లేదని, రాయలసీమ ప్రాజెక్టులపై ఎంత నిర్లక్ష్యం చేశారో .. గత ప్రభుత్వంలో బహిర్గతమైందని, అందుకే హంద్రీ నీవా నుంచి దాదాపుగా 40 నుంచి 60 టీ.ఎం.సీల నీరు వాడుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ, గత వైసీపీ ప్రభుత్వ దౌర్భాగ్యంతో 25 నుంచి ,30 టీఎంసీ నీటినే వినియోగించే పరిస్థితి దాపురించిందని జలవనుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దుయ్యబట్టారు.

మల్యాల హంద్రీ నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం మంత్రి నిమ్మల రామనాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయలసీమలోని మల్యాల హంద్రీ నీవా, పోతిరెడ్డిపాడు, తెలుగు గంగ , గాలేరు నగరి తదితర ప్రాజెక్టుల కోసం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు నుంచి నేడు చంద్రబాబు వరకు కృతనిశ్చయంతో తెలుగుదేశం పార్టీ పని చేస్తోందన్నారు. మల్యాల హంద్రీ నీవా నుంచి దాదాపుగా 700 కిలోమీటర్ల కాలువను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.

కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో ప్రాజెక్టులను పరిశీలిస్తామన్నార .2004, 2019 తమ ప్రభుత్వంలో అప్పలు ఏడు లక్షల కోట్లు ఉంటే అందులో ఇరిగేషన్ కు రూ.72 వేల కోట్లు ఖర్చు చేశామని, ఇక వైసీపీ ప్రభుత్వంలో రూ. 12 లక్షల కోట్లకు అప్పులు పెరిగితే.. ఇరిగేషన్ కు రూ. 49 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి నిమ్మల అన్నారు.

- Advertisement -

అన్నమయ్య జిల్లా లాంటి ప్రాజెక్టు కొట్టుకపోతే దాదాపుగా ఎనిమిది గ్రామాలు మునిగిపోయాయని, అందులో 52 మంది చనిపోయారని, గత సీఎం జగన్ కనీసం అడుగు కూడా పెట్టలేదన్నారు. గత ప్రభుత్వం తప్పిదంతో నేడు విజయవాడలో కృష్ణానది పొంగి పొర్లి వరదలు వచ్చి నానా బీభత్సం చేశాయన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు 10 రోజుల పాటు బస్సులోనే ఉండి అక్కడ పరిస్థితులను చక్కబెట్టారని మంత్రి వివరించారు. .

ఈ కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నేతలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement