Tuesday, November 19, 2024

AP – పట్టిసీమ నుంచి గోదావ‌రి పర‌వ‌ళ్లు – కృష్ణా డెల్టా రైతాంగం కోసం నీరు విడుద‌ల చేసిన మంత్రి నిమ్మల

కృష్ణా డెల్టా రైతాంగం కోసం నీరు విడుద‌ల
పూజలు చేసిన మంత్రి నిమ్మ‌ల‌
పొల‌వ‌రంకు గ్ర‌హ‌ణం ప‌ట్టించిన జ‌గ‌న్
క్యూసెక్కుల‌కు, టిఎంసిల‌కు తేడా తెలియ‌నీ వైసిపి నేత‌లు
ప‌ట్టిసీమ‌ను ఒట్టిసీమంటూ జ‌గ‌న్ కామెంట్స్
ఇప్పుడ‌దే ప‌ట్టిసీమ తో రైతాంగానికి సాగు జ‌లాలు
నిపుణుల స‌హ‌కారంతో పోల‌వ‌రం ప‌నులు ప్రారంభిస్తాం
వివ‌రాలు వెల్ల‌డించిన జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు

ప‌ట్టిసీమ – క్యూసెక్కులకు, టీఎంసీలకు తేడా తెలియని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సాగునీటి వ్యవస్థను భ్రష్టు పట్టించార‌ని, అనడానికి పులిచింతల, పోలవరం ఒక ఉదాహరణగా నిలిచాయాని విమర్శించారు ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు… ప్రజల తాగు నీటి అవసరాలు కూడా ప్రాజెక్టులలో నీటిని నిలువ చేయలేకపోయారని మండిపడ్డారు. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నేటి ఉదయం జలవనరుల శాఖ ప్రత్యేక పూజల అనంతరం గోదావరి నీటిని విడుదల చేశారు.

- Advertisement -

అనంత‌రం పట్టిసీమ డెలివరీ పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, తన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయమని అధికారులను విశాఖపట్నం పంపిన వైఎస్‌ జగన్.. ప్రజల తాగునీటి అవసరాలకు మాత్రం చర్యలు తీసుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. కరువు రహిత దేశంగా, రాష్ట్రంగా ఉండాలి అంటే నదుల అనుసంధానం ముఖ్యం అని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుంద‌ని ముందు చూపుతో పట్టిసీమ ప్రారంభించారన్నారు. పట్టిసీమ ప్రారంభించినప్పుడు ఒట్టి సీమ అంటూ.. వైఎస్ జగన్ అవహేళన చేశారని, ఇప్పుడు అదే పట్టిసీమ ద్వారా రైతుల కష్టాలు తీర్చుతున్నామని స్పష్టం చేశారు.

పోల‌వ‌రం కుడికాల్వ‌లో గోదార‌మ్మ ప‌ర‌వ‌ళ్లు..

ఇక పోలవరం కుడి కాలువలో గోదావరి నీరు పరవళ్లు తొక్కుతోం దీంతో 1000 క్యూసెక్కుల నీరు పట్టిసీమ డెలివరీ పాయింట్ వద్ద ద్వారా పోలవరం కుడి కాలువలోకి చేరుతోంది. కృష్ణ డెల్టా రైతులకు సాగునీరు అందించేందుకు ముందస్తుగా పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. దీనిపై మంత్రి వివ‌ర‌ణ ఇస్తూ భవిష్యత్తు అవసరాల మీద నీటి విడుదల శాతాన్ని అధికారులు మరింత పెంచానున్నారు. . సముద్రంలో వృథాగా పోతున్న నీటిని ఒడిసి పట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చ్చేందుకు పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.. ఇక, సీజన్ సీజన్ కు మార్పులు వచ్చే ప్రాజెక్టులో కాంట్రాక్టర్లను మార్చ వద్దని చెప్పినా వైఎస్‌ జగన్ వినలేదని మండిడ్డారు.. ఇదే విషయాన్ని ఐఐటి నిపుణులు సైతం చెప్పారు.. 15 నెలల సమయం పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేశారు.. నిపుణులు నెత్తి నోరు కొట్టుకున్నా జగన్ పోలవరం ముంచే వరకు నిద్రపోలేదని విమర్శించారు. నిపుణుల స‌హ‌కారంతో పోల‌వ‌రం ప‌నులు త్వ‌ర‌లో ప్రారంభిస్తామ‌ని , సాద్య‌మైనంత త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామ‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement