Friday, November 22, 2024

AP | అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీ…

మద్యం పాలసీపై ఏపీ ప్రభుత్వం త్వరలో కొత్త విధానాన్ని తీసుకురానుందని ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సరసమైన ధరలకు నాణ్యమైన మద్యాన్ని అందించేందుకు కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందిస్తామన్నారు. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులైన మంత్రులు కొల్లురవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం రాష్ట్ర సచివాలయం, 4వ బ్లాక్ లోని ప్రచార విభాగంలో మీడియా సమావేశం నిర్వహించారు.

తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని పేర్కొన్నారు. సొంత ఆదాయం పెంచుకునేలా.. ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టేలా గత ప్రభుత్వం మద్యం పాలసీ చేసుకుంది. నాటి మద్యం పాలసీ వల్ల ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింది. కొత్త మద్యం పాలసీ రూపకల్పనపై కెబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం జరిగింది. మంచి మద్యం పాలసీని త్వరలోనే తీసుకొస్తామని వెల్లడించారు.

ముఖ్యంగా అక్టోబర్ -1 నుంచి కొత్త పాలసీని తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఆరు రాష్ట్రాల్లోని మద్యం పాలసీలను అధ్యయనం చేస్తున్నామని.. వాటిలో ఏది బాగుంటే దానిని ఆదర్శంగా తీసుకుంటామని తెలిపారు. తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా పాలసీ రూపొందిస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఏపీలో గంజాయి వినియోగం పెరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement