Tuesday, November 26, 2024

AP: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్త డ్రస్‌ కోడ్‌.. మండిపడుతున్న మహిళా డాక్ట‌ర్లు..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బంది తప్పనిసరిగా డ్రస్‌ కోడ్‌ పాటించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ ఆదేశాలిచ్చారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం నుంచే డ్రస్‌కోడ్‌ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం మహిళా వైద్యులు స్టెతస్కోప్‌ , ఫుల్ స్లీవ్ వైట్ కలర్ ఆప్రాన్‌, ముదురు నీలం రంగు ట్యాగ్ తో కూడిన గుర్తింపు కార్డు, పేరు, హోదా, ఐడీ నంబర్‌తో కూడిన బ్యాడ్జ్ ధరించాలి.

ఇక పురుషులు స్టెతస్కోప్‌, ఫుల్ స్లీవ్ వైట్ కలర్ ఆప్రాన్‌ వేసుకోవాలి. అదేవిధంగా ముదురు నీలం రంగు ట్యాగ్, బ్యాడ్జ్‌ తో కూడిన ఐడీ కార్డ్ ధరించాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందికి కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

మహిళా వైద్యుల ఆగ్రహం..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసేవారికి ఇలా డ్రస్‌ కోడ్‌ విధించడంపై కొందరు మహిళా వైద్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. స్టాఫ్‌ నర్సులు,సహాయక నర్సులు, ఆశా వర్కర్లు కూడా ఇదే డ్రెస్‌ ధరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురుష వైద్యులకు లేని డ్ర స్‌ కోడ్‌ తమకెందుకంటూ కోప్పడుతున్నారు. విధుల్లో ఉన్నప్పుడు తాము ఫుల్ స్లీవ్ వైట్ ఆప్రాన్ ధరిస్తున్నామని, ఇప్పుడు కొత్తగా శారీ, పంజాబీ డ్రస్‌లపై కూడా నిబంధనలు విధించడం దారుణమంటున్నారు. డ్రస్ కోడ్ నిబంధనలన వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement