Saturday, November 23, 2024

AP New DGP: కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు

:డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాను రాష్ట్రప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. కొత్త డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ద్వారకా తిరుమలరావును నియమించింది. ఈ మేరకు సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.

.ప్రస్తుతం తీరుమలరావు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు ఏపీ డీజీపీగా రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు ఆయనపై ఈసీ వేటు వేసింది. బాధ్యతల నుంచి తప్పించింది. నూతన డీజీపీ గా హరీష్ గుప్తాను నియమించింది. ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. భారీగా అధికారుల బదిలీలను చేపట్టింది. సీఎస్ గా నీరభ్ కుమార్ ను నియమించింది. ఈ రోజు ఏకంగా 29 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ క్రమంలో డీజీపీగా ద్వారకా తిరుమలరావు ను నియమించింది. రానున్న రోజుల్లో మరిన్ని బదిలీలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

వాస్తవానికి చంద్రబాబు సీఎం కాగానే.. ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమిస్తారని అంతా భావించారు. ఎన్నికల సమయంలో నాటి డీజీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఈసీ తొలగించి హరీశ్‌కుమార్‌ గుప్తాను నియమించింది. ఆయననే కొనసాగించాలని కొత్త ప్రభుత్వం కూడా భావించింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా జరిగిన గందరగోళం ఆయనకు ప్రతికూలంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement