Friday, November 22, 2024

AP – రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ..

స‌హ‌య కార్య‌క్ర‌మాల‌లో 10 టీమ్ లు
ఇప్ప‌టికే రంగంలోకి దిగిన 18 టీమ్ లు
ప్ర‌త్యేక విమానంలో చేరుకున్న స్పీడ్ బోట్లు
సింగ్ న‌గ‌ర్, కృష్ణ‌లంక ప్రాంతాలో బాధితులు త‌ర‌లింపు
పునరావాస శిబిరాల‌కు ముంపు ప్రాంత ప్ర‌జ‌లు
రంగంలోకి హెలికాప్ట‌ర్ లు… ఆహార పొట్లాలు జార‌విడుపు
చంద్ర‌బాబు స్వ‌యంగా ప‌ర్య‌వేక్ష‌ణ .

విజయవాడ: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. తమిళనాడు నుంచి 3, పంజాబ్ నుంచి 4, ఒడిశా నుంచి 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. పవర్ బోట్లు, రెస్క్యూ పరికరాలతో వారు వచ్చారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో సహాయక చర్యల్లో 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాలు పంచుకుంటున్నాయి. ఇప్పుడు దీనికి అద‌నంగా నేడు చేరుకున్న 10 టీమ్ లు రంగంలోకి దిగాయి.. ఇక వాయుమార్గం ద్వారా సహాయక చర్యల్లో హెలికాప్టర్లు పాల్గొంటున్నాయి. కేంద్రం 84 హెలికాప్టర్లు విజయవాడ పంపింది.. వ‌చ్చిన వెంట‌నే హెలికాప్ట‌ర్ లు రంగంలోకి దిగాయి.. ముంపు ప్రాంతాల‌లోని చిక్కుకున్న‌ప్ర‌జ‌ల‌కు హెలికాప్ట‌ర్ ద్వారా ఆహార‌, మంచినీళ్లు జార‌విడుస్తున్నాయి..

ఫలించిన చంద్రబాబు మంత్రాంగం..
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం ఫలించింది. కేంద్రంతో నేరుగా సంప్రదింపులు జరపడంతో విజయవాడకు పవర్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు కేంద్రం బోట్స్‌ను పంపించింది. మరోవైపు లుధీయానా నుంచి ఆర్మీ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో బొట్లతో విజయవాడ వరద ప్రాంతాల్లోకి వెళ్లాయి. సుమారు 100 మందితో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులను వేగవంతంచేయడం జరిగింది. పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం సూచించారు. పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ళ బాటిల్స్‌ను ప్రభుత్వం అందిస్తోంది. ప్రైవేటు హోటల్స్, దుర్గ గుడి, అక్షయ పాత్రల ద్వారా ప్రభుత్వం ఆహారం సమకూర్చుతోంది. మరోవైపు శేష సాయి కల్యాణ మండపంలో లక్షల మంది వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ రంగం, విజయవాడ హోటల్స్ ఫుడ్ తయారు చేస్తున్నాయి. లక్ష మందికి టిఫిన్.. లక్ష మందికి భోజనాన్ని హోటల్స్ యంత్రాంగం అందిస్తోంది.

- Advertisement -

ముంపు ప్రాంతాల్లో మరోసారి పర్యటనతో సహాయక చర్యలను చంద్రబాబు పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి నిరంతర సమీక్షలు, మానిటరింగ్ సత్ఫలితాన్నిస్తున్నాయి. చంద్రబాబు సూచనలతో అధికార యంత్రాంగం సైతం చురుకుగా పనులు నిర్వర్తిస్తోంది. నిరంతర పర్యవేక్షణతో ఉదయం వరకూ ఆహారం సిద్ధం చేసి అధికారులు పంపిణీ చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement