పోటీకి వైసిపి దూరం
ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్
నామినేషన్స్ పత్రాల పరిశీలన అనంతరం ప్రకటన
అమరావతి – రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులుగా టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్, బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యలు నేడు తమ నామినేషన్ లు దాఖలు చేశారు.. ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ల ను బలపరుస్తూ, 10 మంది చొప్పున కూటమి ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.వైసీపీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవం కానుంది. కాగా, నామినేషన్ల అనంతరం అభ్యర్ధులు మాట్లాడుతూ, కూటమి ఆశయాలకు అనుగుణంగా తమ గళాన్ని పెద్దల సభలో వినిపిస్తామన్నారు..
బిసి గళం వినిపిస్తా – కృష్ణయ్య …
చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తానని తెలిపారు బిజెపి అభ్యర్ధి కృష్ణయ్య. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ పిలిచి తనకు రాజ్యసభ టికెట్ ఇచ్చిందని అన్నారు. సీఎం చంద్రబాబు తనను రాజకీయాల్లోకి పిలిచారని గుర్తుచేశారు. పార్లమెంట్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు..50 ఏళ్లు బీసీల కోసం పోరాటం చేశానని చెప్పారు. వైసీపీకి పార్టీలో మాట్లాడే అవకాశం తక్కువ అని.. బీసీల గురించి ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంటుందని పార్టీ మారానని తెలిపారు. బీజేపీ తనకు కొత్త కాదని, తాను కండువా కప్పుకున్న మొదటి పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. పార్టీల కండువాలు వేసుకోలేదు. అన్ని పార్టీలు బీసీల కోసం న్యాయం చేస్తున్నాయని చెప్పారు. పార్టీలే తన దగ్గరకు వచ్చాయని బీజేపీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు.
ఎపి అభివృద్ధికి పాటు పడతా – బీదా మస్తాన్ రావు
రాష్ట్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థి బీదా మస్తాన్ రావు తెలిపారు. అనివార్య కారణాల వల్ల రెండున్నరేళ్లు తెలుగుదేశానికి దూరమయ్యానని అన్నారు. సొంతిల్లు లాంటి తెలుగుదేశంలో కొంతకాలం లేకపోవడం ఎంతో బాధించిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు కీలక పదవులు ఆపార్టీలో దక్కుతున్నాయని బీదా మస్తాన్ రావు తెలిపారు.
బాధ్యతతో నిర్వర్తిస్తా: సానా సతీష్
చిన్న వయస్సులోనే నాకు కీలక పదవి ఇచ్చి ప్రోత్సహించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్ ధన్యవాదాలు తెలిపారు. వచ్చిన అవకాశాన్ని బాధ్యతతో నిర్వర్తిస్తానని సానా సతీష్ చెప్పారు.