Sunday, September 8, 2024

AP – వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం – చంద్రబాబు

పెనుకొండ – రాయలసీమకు నీళ్లు, పెట్టుబడులు, ఉద్యోగాలపైనే దృష్టి పెట్టామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.18 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసి కియా పరిశ్రమను తీసుకొచ్చామని.. ఇప్పుడు ఎకరా 2 కోట్లు ఉంది, మనం ఉంటే ఎకరా 5 కోట్లు అయ్యేదని ఆయన అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో నేడు జరిగిన టీడీపీ ‘రా కదలి రా’ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, తన మీద నమ్మకంతో కియా పరిశ్రమ పెనుకొండకు వచ్చిందన్నారు. ఐదేళ్లలో కియా పరిశ్రమను తెచ్చాం….పదేళ్లు టీడీపీ అధికారంలో ఉంటే మరిన్ని పరిశ్రమలు వచ్చేవన్నారు. రాజశేఖర్ రెడ్డి హాయంలో లేపాక్షి నాలెడ్జ్ సిటీ , స్తెన్స్ సిటీ వచ్చిన ఒక్కరికీ ఉద్యోగాలు రాలేదని విమర్శించారు. నాలెడ్జ్ హబ్ లో జగన్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు.

సీఎం జగన్ ఈ రాష్ట్రాన్ని తన తాత జాగీర్ అనుకున్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు. సిద్ధం సభకు వచ్చిన సీఎం జగన్ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు మీద కూడా మాట్లాడలేదన్నారు. టీడీపీ-జనసేన కలయిక ఒక పాశుపతాస్త్రమని.. అన్నారు. సీఎం జగన్ ఓడిపోవడానికి సిద్ధమని.. రాబోయే ఎన్నికల్లో గెలిచేది టీడీపీ- జనసేన కూటమి అని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పింఛన్ విధానం ప్రారంభించింది ఎవరో నన్ను విమర్శించే వారికి తెలుసా అంటూ ప్రశ్నించారు. తాము కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇస్తామన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3వేలు ఇస్తామని.. వాలంటీర్ల ఉద్యోగాలను తీసేయమని… వాలంటీర్లు వ్యవస్థ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.వాలంటీర్లు వైసీపీ దొంగలకు పనిచేయొద్దన్నారు. రాయలసీమలో ముఠా నాయకులను అణిచివేసింది తెలుగుదేశం పార్టేనని ఆయన అన్నారు. రాజకీయ రౌడీలు నాకు లెక్క కాదు.. టీడీపీ కార్యకర్తలను వేధించే వాళ్లకు ఖబడ్దార్… దెబ్బకి… దెబ్బ, మంచికి… మంచి అంటూ హెచ్చరించారు. మేము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు చురకలుసత్యసాయి జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు చురకలు అంటించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. “పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ అనంతపురం ఎంపీ అభ్యర్థిగా ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడు కళ్యాణదుర్గాన్ని సర్వం దోచుకున్న మంత్రి ఉషశ్రీ ఇప్పుడు పెనుకొండకు వచ్చింది.. పెనుకొండకు శంకరనారాయణ పోయినా… ఆయన కంటే భయంకరమైన ఉషశ్రీ ఇక్కడికి వచ్చింది. దౌర్జన్యాలు, దోపిడీల్లో రాప్తాడు ఎమ్మెల్యే తోపు. నా దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి నీ అకౌంట్ సెటిల్ చేస్తా తోపు. ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు కేతిరెడ్డి. సోషల్ మీడియాలో పేపర్ టైగర్ కేతిరెడ్డి. జిల్లాలోనే అత్యంత అవినీతిపరుడు కదిరి ఎమ్మెల్యే… ఆయనకు సీటు కూడా పోయింది. పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దికుంట అవినీతి పుట్ట… పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సీటు కూడా డౌటే. మడకశిరకు పట్టిన రోగం ఎమ్మెల్యే తిప్పేస్వామి…. తిప్పేస్వామి సీటు కూడా చినిగిపోయింది.” అని టీడీపీ అధినేత అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement