Friday, November 22, 2024

AP – మిలన్ 24 వేడుకలు .. ముఖ్యఅతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి, ఏపీ గవర్నర్

విశాఖపట్నం, ఫిబ్రవరి 22 (ప్రభ న్యూస్ బ్యూరో) తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న మిలాన్ 24 వేడుకల్లో భాగంగా గురువారం విశాఖ ఆర్కే బీచ్ వేదిక సిటీ పరేడ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి గదీప్ ధన్కర్ తో పాటు ఏపీ గవర్నర్ నజీర్, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాప్ ఆర్,.హరికుమార్, తూర్పు నౌకాదళం అధికారి రాజేష్ పెన్దర్కర్, నేవి ఉన్నతాధికారులు, ఫ్లాగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నే దేశ విదేశాల నుంచి వచ్చిన అధికారులు అంతా పొరుగు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ప్రతిబింబించే విధంగా చేపట్టిన యుద్ధ విన్యాసాలు తదితర కార్యక్రమాలు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు నేవీ కుటుంబానికి చెందిన ప్రతినిధులతో పాటు నగర ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో విశాఖ సాగర్ తీరం జనసంద్రంగా మారింది మరోవైపు ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.

భారత ఉప రాష్ట్రపతికి ఆత్మీయ వీడ్కోలు
కాగా, భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు ఐ.ఎన్.ఎస్ డేగాలో రాష్ట్ర గవర్నర్, నేవీ అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. గురువారం మిలాన్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మధ్యాహ్నం 12.30 గం.లకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్నారు. అక్కడ ఉప రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, తూర్పు నావికాదళ అధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలు నాయుడు, శాసన సభ్యులు పిజివిఆర్ నాయుడు (గణబాబు), పోలీస్ కమీషనర్ డా.ఎ.రవిశంకర్, నేవీ కమోడోర్ దిలీప్ సింగ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ సమీర్ సక్సెనా, రెవెన్యూ డివిజనల్ అధికారి హుస్సేన్ సాహెబ్ తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం ఉప రాష్ట్రపతి భారత వైమానిక దళ ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.42 గం.లకు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement