బస్సు ఆపి రోడ్డుపై దేవర సాంగ్ కు డ్రైవర్ డ్యాన్స్
ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిన ఆర్టీసీ
విషయం తెలుసుకున్నమంత్రి నారా లోకేష్
మళ్లీ నీకు ఉద్యోగం వస్తుందని ఆమెరికా నుంచి మంత్రి మెస్సెజ్
అమరావతి – రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ ఠాణా నుంచి రావుతులపూడి నుంచి విద్యార్థులను తీసుకుని బస్సు తునికి ప్రయాణం మొదలయింది. అయితే, కోడూరు సమీపంలో సింగిల్ రోడ్డు ఉండడంతో అదే దారిలో రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్ ఆగిపోయింది. దాంతో బస్సు అక్కడే ఆపేయడంతో ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు బస్సు ముందు దేవర సినిమా పాటలకు డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో బస్సు డ్రైవర్ ను ఆర్టీసీ అధికారులు సస్పెండ్ చేశారు..
ఆర్టీసీ డ్రైవర్ సస్పెండ్ అయిన విషయం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ తెలిసింది.. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి వివరాలు సేకరించారు.. బస్సు ఎందుకు ఆగిందని?, డ్యాన్స్ వేసిన ఘటనపై ఆరా తీశారు. ట్రాక్టర్ బస్సును ఆపిందని లోవరాజు చెప్పారు. ఆ సమయంలో సరదాగా డాన్స్ చేసానని, డ్రైవింగ్ తన పని అని చెప్పాడు. అయితే ట్రాక్టర్ ఆగినప్పుడే బస్సును ఆపినట్లు ఆర్టీసీ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అతని తప్పు లేనప్పటికీ డ్రైవర్‌ను సర్వీసు నుంచి తొలగించారని తెలుసుకున్న మంత్రి లోకేశ్ తాజాగా సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
ఈ సందర్బంగా డ్రైవర్ ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదంటూనే ఆయనకు మరో బంపరాఫర్ కూడా ప్రకటించారు. డ్రైవర్ సస్పెన్షన్ ఆర్డర్స్‌ను ఎత్తివేస్తారని.. ఆయన వెంటనే తన ఉద్యోగంలో చేరొచ్చని తెలిపారు. అలాగే తాను అమెరికా నుంచి రాగానే.. ఆర్టీసీ డ్రైవర్ లోవరాజును పర్సనల్‌గా కలుస్తాను అంటూ ట్వీట్ చేశారు లోకేష్. ఇక ఈ ట్వీట్ ను చూసిన నెటిజన్లు మంత్రి లోకేష్‌పై పెద్దెత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. పెద్దమనసుతో స్పందించి ఆర్టీసీ డ్రైవర్ లోవరాజుకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.