Tuesday, November 19, 2024

AP – మీ కోసం రెడ్ కార్పెట్ రెడీ – ఐటీ కంపెనీలకు నారా లోకేష్ ఇన్విటేషన్

ఆంధ్ర ప్రభ స్మార్ట్ అమ రావతి: ఏపీలో ఐటీ, ఏఐ, డేటా సెంటర్‌ క్లస్టర్‌ విస్తరణకు నాస్కామ్‌కు ఐటీ మంత్రి నారా లోకేశ్‌ ఆహ్వానం పలికారు. నాస్కామ్‌కు స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్‌ సిద్ధంగా ఉందంటూ ఆహ్వానం పంపారు..

కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024 పారిశ్రామిక బిల్లుపై నాస్కామ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ సంస్థ నిరాశను ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకుందన్న లోకేశ్‌.. ఏపీలో ఐటీ, ఐటీ సేవలు, ఏఐ ఇంటెలిజెన్స్‌, డేటా సెంటర్‌ క్లస్టర్‌కి వ్యాపారాలను విస్తరించుకోవచ్చని నాస్కామ్‌కు లేఖ రాశారు.

విశాఖలో ఏఐ, డేటా సెంటర్ ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని ప్రతిపాదనలో తెలిపారు. తమ వ్యాపారాలను ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేసుకోవచ్చని ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడులకు అత్యుత్తమ సౌకర్యాలు, నిరంతర విద్యుత్, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నాస్కామ్ ఐటీ సంస్థకు ప్రభుత్వం నుంచి పరిమితులు లేని నైపుణ్యం కలిగిన ప్రతిభను అందిస్తామని లోకేష్ వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement