(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయనగరం) – సీఎం జగన్ మోహన్‌రెడ్డి పచ్చి అబద్దాల కోరు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు నవరత్నాలు అన్నారు, అవి నవ మోసాలుగా మారిపోయాయని, ఇంట్లో పిల్లలందరికీ అమ్మ ఒడి అని చెప్పి.. ఇప్పుడు ఒక బిడ్డకే అమ్మవడి అంటున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్ర స్థాయిలో సీఎం జగన్ పై విరుచుకు పడ్డారు. శనివారం శృంగవరపుకోట శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ… రాబోయే రెండు నెలల్లో జగన్‌తో రాష్ట్ర ప్రజలు ఫుట్ బాల్ ఆడుకోబోతున్నారన్నారు.
కుర్చీ మడత పెడతామంటే అరగంట అంబటి తెగ బాధపడుతున్నారని, సీఎం జగన్ ఎక్కింది కుర్చీ కాదని, సింహాసనమంటూ అరగంట అంబటి చాలా బాధపడుతున్నారని, నిజమే రాష్ట్ర సింహాసనంపై శునకం కూర్చుంది. ఆ శునకాన్ని తరిమి తరిమి కొట్టాలంటే ..అంగీకరిస్తావా? అంబటి గుర్తుపెట్టుకో’’ అంటూ లోకేష్ కామెంట్స చేశారు. ప్రజల కన్నీళ్ల చూసిన చంద్రబాబు సూపర్ ఆరు పథకాలు పెట్టబోతున్నారని తెలిపారు.ఇక ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తరువాత మాత్రమే ఓట్లను అడుగుతానని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత ఊర్లు కాదుకదా వీధి వీధికి మద్యం ఏరులై పారుతుందని మండిపడ్డారు.
పెన్షన్ పేరుతో మోసం..
అలానే నలభై ఐదు ఏళ్ళ వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళకు పెన్షన్ ఇస్తాను అని చెప్పి జగన్ మాటతప్పారని ఆరోపించారు.బాబు ప్రకటించిన సూపర్ సిక్స్ అంటే జగన్ మాటలో కిచిడీ కాదని, రాయల సీమ రాగి సంకటి లాంటి పవిత్రమైందని, సైకో జగన్ ను తరిమి తరిమి కొట్టేందుకు ఈ సూపర్ సిక్స్ పని చేస్తుందని లోకేష్ అన్నారు. రాష్టంలో వైసీపీకి అభ్యర్ధులు దొరకటం లేదని, ఎంపీ అభ్యర్థులు దొరకక ఇతర జిల్లాల నుంచి తీసుకు వస్తున్నారని అన్నారు. విజయనగరం నుంచి విశాఖపట్నానికి, చిత్తూరు నుంచి నరసరావుపేటకు బెట్టింగ్ స్టార్ను తీసుకువచ్చారని విమర్శించారు.
, గుంటూరు సీటు కోసం ఓ క్రికెటర్ వస్తే ఎంత ఇస్తావని, ఎప్పుడు ఇస్తావని అడగటంతో ఆ క్రికెటర్ పారిపోయారని లోకేష్ ఆరోపించారు.., కర్నూలు ఎంపీ స్థానానికి రావటానికి ఓ మంత్రి ఒప్పుకోలేదని, తిరుపతి ఎంపీ స్థానానికి ఆదిమూలానికి ఇస్తు బై బై జగన్ అని ఆయన వెళ్లిపోయారని లోకేష్ చెణిగారు. 75 సీట్లకు అభ్యర్థులు దొరకటం లేదని, బీసీలను బ్యాక్ బోన్ అన్న వ్యక్తి బీసీలకు అన్యాయం చేశారని అన్నారు. ఎస్సీల దగ్గరకు వెళ్లి తాను దళిత బిడ్డనని చెప్పిన జగన్ అధికారం వచ్చాక అహంకారంతో చెలరేగిపోయారని అన్నారు, దళిత బిడ్డలపై రెచ్చిపోయి, మృతదేహాలను పార్శిల్ చేశారని, రాష్టంలో సామాజిక న్యాయం లేదని, సామాజిక అన్యాయం ఉందని వైసీపీ నాయకులే అంటున్నారని లోకేష్ చెప్పారు. అభివృద్ధి కోట శృంగవరపుకోటని అవినీతి కోటగా ఎమ్మెల్యే కడుబండి మార్చేశారని ఆరోపించారు. కరోనా సమయంలో స్ధానిక పరిశ్రమల యాజమాన్యాలు నుంచి ఎమ్మెల్యే కడుబండి భారీగా కలెక్షన్లు చేశారన్నారు. అవినీతి సామ్రాట్ జగన్‌కు తానేమీ తక్కువ కాదన్న రీతిలో ఎమ్మెల్యే కడుబండి అవినీతి డబ్బు యాభై కోట్లతో ప్యాలెస్ నిర్మించుకుంటున్నారని లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.