Monday, November 18, 2024

AP – మంగ‌ళ‌గిరిలో లోకేష్ ప్ర‌జా ద‌ర్బార్ …

మంత్రి నారా లోకేశ్‌ మంగళగిరి ప్రజల కోసం ఉండవల్లిలోని నివాసంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి ‘ప్రజా దర్బార్‌’ నిర్వహించారు. దీంతో సమస్యలు విన్నవించేదుకు నియోజకవర్గ ప్రజలు ప్రజా దర్బార్‌కు తరలివచ్చారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని లోకేశ్‌ వారికి హామీ ఇచ్చారు. ఆయా విభాగాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సంద‌ర్బంగా మంగళగిరి ప్రజల కోసం రెగ్యుల‌ర్ గా ‘ప్రజా దర్బార్‌’ నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశామన్నారు. భారీ మెజార్టీతో గెలిచిన తనపై బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రజలను కలుస్తామని చెప్పారు. ఉదయం 8 గంటలకు ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటామన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement