Thursday, January 9, 2025

AP – నంద్యాల సబ్ రిజిస్టార్ సస్పెన్షన్

నంద్యాల ….. జిల్లాలోని నంద్యాల సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ నాయక్ ను సస్పెండ్ చేస్తూ కర్నూల్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిఐజి కళ్యాణి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్టు జిల్లా రిజిస్టార్ చుండూరు జానకి దేవి మంగళవారం తెలిపారు.

ఆమె తెలిపిన వివరాల మేరకు కడప జిల్లా ప్రొద్దుటూరు కు చెందిన కోర్టు వివాదంలో ఉన్న ఓ ఇంటిని రహస్యంగా నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ విషయంపై ప్రతివాదులు కర్నూలు జిల్లా రిజిస్ట్రేషన్ స్టాంప్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అబ్దుల్ సత్తార్ నాయకులు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి కేసులు కొన్ని ఉన్నాయని వీటిని కూడా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement