తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
కొన్నిరోజులుగా ఆయన్ను వేటాడుతున్న పోలీసులు గురువారం నాడు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. మంగళగిరి రూరల్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. సురేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో నందిగం సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
- Advertisement -
హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నం చేస్తున్నారని సమాచారం అందుకున్న హైదరాబాద్‌కు వెళ్లి పోలీస్ ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి. సురేష్‌ను గుంటూరు జిల్లాకు పోలీసులు తరలిస్తున్నారు. ముందుగా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు.