తనతో పాటే పని చేసినందుకే పార్టీ పరంగా గుర్తింపు
నాదేండ్ల, కందుల,హరిప్రసాద్ లకు పార్టీ సేవలకు గుర్తింపుగానే పదవులు
నాగబాబు వారసత్వ రాజకీయ జీవి కాదు
స్వతంత్రంగానే పార్టీ లో ఎదిగిన నేత
రాజ్యసభకు పంపాలని అనుకున్నాం…
సాధ్యం కాకపోవడంతోనే ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిస్తున్నాం
ఇక నెలలో సగం రోజులు జిల్లా పర్యటనలలోనే
ఆరు నెలల్లో అన్ని జిల్లాల పర్యటనలు పూర్తి చేస్తాం
ప్రజల ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా పాలనలో ముందుకెళ్తాం
అమరావతి: రాజకీయాల్లో పని తీరే ప్రామాణికమని, కలిసి పనిచేసిన వారిని గుర్తించాల్సిన బాధ్యత తనకు ఉందని ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన సోదరుడు నాగబాబు పార్టీ కోసం ఎటువంటి ప్రతిఫలం అశించకుండా తనతో పాటు సమానం పని చేశారని చెప్పారు.. వైసీపీ నేతలతో తిట్లు తిన్నా పార్టీ కోసం నాగబాబు నిలబడ్డారన్నారు. ఇక్కడ కులం, బంధుప్రీతి కాదన.. పనిమంతుడా కాదా? అన్నది చూడాల్సి ఉందన్నారు.. పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా అయనను రాజ్యసభకు పంపాలని భావించామన్నారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించనున్నామని చెప్పారు. మార్చిలో శాసన మండలికి జరిగే ఎన్నికలలో నాగబాబు కు అవకాశం ఇస్తామని, అ తర్వాత చంద్రబాబు ఆయనను తన కేబినేట్ లోకి తీసుకుంటారని వెల్లడించారు.
ఇక నాదేండ్ల మనోహర్ కులంతో సంబంధం లేకుండా పార్టీని అంటిపెట్టుకుని ఉండటంతో పాటు పార్టీ విజయానికి ఎనలేని కృషి కి ప్రతిఫలంగాను అమాత్య పదవి దక్కిందన్నారు.. ఇక హరి ప్రసాద్ తొలి నుంచి తనకు తోడుగా ఉంటూ పార్టీని బలోపేతం చేశారని అందుకే ఆయనను ఎమ్మెల్సీ ని చేశామన్నారు.. మంత్రి గా బాధ్యతలు నిర్వహిస్తున్న కందుల దుర్గేష్ కులం ఏమిటో ఇప్పటివరకు తనకు తెలీయదన్నారు.. పార్టీకి ఆతడు చేసిన సేవలకు గుర్తింపుగానే మంత్రి పదవి ఇచ్చామన్నారు.. పార్టీ కోసం పని చేసే వారికి కులం,మతం, ప్రాంతంలో ఎటువంటి సంబంధం లేకుండా గుర్తింపు ఇస్తామని పవన్ చెప్పారు.
వచ్చే నెల నుంచి జిల్లాలో పర్యటన
ఇకపై నెలలో సగం రోజలు ప్రజల మధ్యలోనే ఉంటానని చెప్పారు పవన్ కల్యాణ్.. జనవరి 15 తర్వాత 14 రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తానని తెలిపారు.. అరు నెలల పాటు అన్ని జిల్లాలోనూ పర్యటిస్తానని వెల్లడించారు..ప్రజలు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా పాలనలో ముందుకు వెళతామని జనసేనాని వెల్లడించారు.