నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, వాటర్ ఫిల్టర్ బెడ్లు మరియు నీటి సరఫరా పథకాలను న్యాయ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి ఎన్.ఎండీ ఫరూక్ పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నంద్యాల ప్రజల నీటి సమస్యను పరిష్కరిస్తామని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని విస్తరించి ఫ్యూచర్లో నంద్యాలలో నీటి సమస్య రాకుండా చూస్తామన్నారు …
అంతేకాకుండా గత తెలుగుదేశం హయాంలోనే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి సమస్యను పట్టించుకోవడంలో విఫలమైందన్నారు ఎంతసేపు ఉన్నా వారి కుటుంబము వారి అభివృద్ధి చేసుకోవడమే తప్ప ప్రజల సమస్యలు పట్టి పట్టనట్టు వ్యవహరించిన ఈ వైఎస్ఆర్సిపి నాయకులకు నంద్యాల ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తెలుగుదేశం హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు గమనించి తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు .
గతంలో మాదిరే ఈసారి కూడా అభివృద్ధి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అనే విధంగా నంద్యాల రూపురేఖలను మారుస్తావని ఫరూక్ తెలియజేశారు .
.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మరియు పబ్లిక్ హెల్త్ విభాగం డిఈ , ఏఈలు తదితరులు పాల్గొన్నారు.