Sunday, November 24, 2024

AP ఎన్టీఆర్ స్కూల్ చ‌రిత్ర దేదీప్య‌మానం – ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు

శ్రీ‌కాకుళం, (ప్రభ న్యూస్): శ్రీ‌కాకుళం న‌గ‌రంలోని ఎన్‌టీఆర్ మున్సిప‌ల్ స్కూల్‌లో ఎంపీ ల్యాండ్ నిధుల‌తో నిర్మించ‌నున్న తిల‌క్ హాల్‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని శ్రీ‌కాకుళం పార్ల‌మెంట్ స‌భ్యులు కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు అధికారులను కోరారు. న‌గ‌రంలోని ఎన్‌టీఆర్ మున్సిప‌ల్ పాఠశాల ఆవ‌ర‌ణ‌లో పూర్వ‌విద్యార్థుల ఆధ్వ‌ర్యంలో తిల‌క్‌హాల్ నిర్మాణానికి ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే ల‌క్ష్మీదేవి శ‌నివారం శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు మాట్లాడుతూ తిల‌క్ హాల్ నిర్మాణాన్ని మూడు నెల‌ల్లో పూర్తి చేయాల‌ని చెప్పారు. శ్రీ‌కాకుళం జిల్లా చ‌రిత్ర‌లో ఎన్‌టీఆర్ మున్సిప‌ల్ స్కూల్ ఘ‌న‌త దేదీప్య‌మాన‌మ‌ని తెలిపారు.

ఈ పాఠ‌శాల‌లో చ‌దివిన ఎంతో మంది విద్యార్థులు రాజ‌కీయ నేత‌లు, ఉన్న‌త ఉద్యోగులుగా, డాక్ట‌ర్లుగా, లాయ‌ర్లుగా గా ఉన్నార‌ని చెప్పారు. శ్రీ‌కాకుళం జిల్లా భ‌విష్య‌త్ తీర్చిదిద్దిన ఖ్యాతి ఎన్‌టీఆర్ మున్సిప‌ల్ హైస్కూల్‌కు ఉంద‌న్నారు. క‌రోనా స‌మంలో ఈ భ‌వ‌న నిర్మాణానికి 30 ల‌క్ష‌ల రూపాయిలు మంజూరుకు అంగీక‌రించార‌ని, ప్ర‌స్తుతం పెరిగిన ఖ‌ర్చు దౄష్ట్యా రూ. 50 ల‌క్ష‌లు అవ‌స‌రం కాగా, ఇచ్చిన మాట‌కు కట్టుబ‌డి రూ.50ల‌క్ష‌లు అందించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గుండ ల‌క్ష్మీదేవి మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో పాఠ‌శాల‌కు అద‌నంగా ఏడు గ‌దులు మంజూరు చేశాన న్నారు. జిల్లాలోని ఎంద‌రో ఉన్న‌త స్థితిలో స్థిర‌ప‌డ్డారంటే ఆనాడు ఈ స్కూల్‌లో నేర్చుకున్న పాఠాలేన‌ని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement