Thursday, December 12, 2024

AP – ఏజెన్సీలో మావోయిస్టులు అలజడి – కారు దగ్ధం

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో సరివెల వద్ద జాతీయ రహదారి-30పై కారును పూర్తిగా దగ్ధం చేసారు..

చింతూరులో రహదారిపై నుంచి వెళుతున్న కారును ఒక్కసారిగా చుట్టుముట్టారు. అనంతరం అందులోని ప్రయాణికులను కిందకు దింపారు.

ఆ తర్వాత కారుకు నిప్పంటించారు. మావోయిస్టుల చర్యలను ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడ్డారో మాత్రం ఇంకా తెలియరాలేదు. అదృష్టవశాత్తు ప్రయాణికులు ప్రాణాలతో బయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు పోలీసులు. అయితే ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనపై చింతూరు ఏజెన్సీ ఉలిక్కిపడింది

- Advertisement -

.

Advertisement

తాజా వార్తలు

Advertisement