డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ అనంత బాబును వైసీపీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ బుధవారం సాయంత్రం కీలక ప్రకటన చేసింది. ఏపీలో కలకలం రేపిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈ మర్డర్ కేసులో తన తప్పిదాన్ని అనంతబాబు ఒప్పుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా… న్యాయమూర్తి ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. సుబ్రహ్మణ్యం హత్యపై విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది.
Breaking: మర్డర్ కేసులో ఇరుక్కున్న ఏపీ ఎమ్మెల్సీ.. వైసీపీ నుంచి అనంతబాబు సస్పెన్షన్
Advertisement
తాజా వార్తలు
Advertisement