ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు, ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీ కరీమున్నీసా శుక్రవారం రాత్రి చనిపోయారు. కార్యకర్తలు అభిమానులు కంటతడి పెడుతున్నారు. హఠాత్తుగా గెండెపోటు రావడంతో ఆమె చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నిసా మృతి పార్టీకి తీరని లోటు అని వైసీపీ నేతలు అంటున్నారు. శాసనమండలి సమావేశానంతరం ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రెండు హాస్పటల్స్‌కు తరలించినా ఫలితం లేకపోయింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీకోసం పనిచేశారు. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఆమెకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. కాగా, సీఎం జగన్ ఆమె మృతికి సంతాపం ప్రకటించారు.