ఎమ్మెల్సీ పోస్ట్ కు సైతం రాజీనామా
అమరావతి – వైసీపీకి మరో షాక్ తగిలింది. కైకలూరు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఆ పార్టీని వీడారు. ఎమ్మెల్సీ పదవితో పాటు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు జయమంగళ వెంకటరమణ శనివారం ప్రకటించారు. రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ మోసేనురాజుకు పంపించినట్లు తెలిపారు.
కైకలూరు నియోజకవర్గం నుంచి గతంలో జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీగా గెలిచారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ సమక్షంలో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. దీంతో ఆయనకు జగన్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడంతో వెంకటరమణ నేడు ఆ పార్టీకి బైబై చెప్పి తిరిగి సొంత గూటికి చేరుకోనున్నట్లు సమాచారం.