Tuesday, November 26, 2024

AP – మానవ మృగాల వేట‌కు బాలిక బ‌లి … అదృశ్య‌మైన మైన‌ర్ క‌థ విషాదాంతం ….

-ముచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక ఘటన విషాదాంతం.
-బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసి హత్య
శవాన్ని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంలో పడేసిన నిందితులు.

పగిడాల మండలం ముచ్చుమర్రిలో దారుణం చోటు చేసుకుంది. గ్రామం కు చెందిన తొమ్మిదేళ్ల మైనర్ బాలిక ఇంటి ముందు ఆడుకుంటూ గత ఆదివారం అదృశ్యమైంది. బాలిక అదృశ్యమైన విషయం గ్రామమంతా దానవంలా వ్యాపించడంతో గత మూడు రోజులుగా పోలీస్ బృందాలు జాగిలంతో గాలిస్తున్నారు. వీరికి స్థానిక ప్రజలు తోడయ్యారు. అయినప్పటికీ బాలి ఆచూకీ కనిపించలేదు. దీంతో మూడు బృందాలుగా రంగంలో దిగిన పోలీసులు తమ జాగిలంతో గాలించిన ఫలితం లేకపోయింది. అయితే మంగళవారం రాత్రి పోలీసులకు అందిన సమాచారం మేరకు అదే గ్రామం చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఆ తర్వాత తమ దైన స్థాయిలో పోలీసులు విచారణ సాగించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. సంబంధిత బాలికను ఇంటి ముందు ఆడుకుంటుండగా తనతో పాటు మరో ఇద్దరు యువకులు బాలికను తీసుకెళ్లినట్లు యువకుడు పోలీసు విచారణలు అంగీకరించినట్లు సమాచారం. ఆ తర్వాత ముగ్గురు యువకులు బాలికపై అత్యాచారం చేసి.. చంపి కృష్ణానదిలో (ముచ్చుమర్రి లిఫ్టు పథకం) పడేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించినట్లు సమాచారం. ఆ తర్వాత ఇద్దరు యువకులను కూడా పోలీసుల అదుపులో తీసుకొని స్టేషన్ కితరలించారు. ప్రస్తుతం చిన్నారి మృతదేహం కోసం ముచ్చుమర్రి లిఫ్ట్ కృష్ణా నదిలో పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహం లభ్యమైన అనంతరం వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు.

నిందుతులు ఎవరైనా సరే వదలి పెట్టేది లేదు …

- Advertisement -

ఇటీవల అదృశ్యమైన ముచ్చుమర్రి గ్రామానికి చెందిన బాలిక వాసంతి గాలింపు చర్యల్లో పరిశీలించిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య బుధవారం పరిశీలించారు అనంతరం బాలిక తండ్రి ని కలిసి పరామర్శించి కుటుంబాన్ని ప్రభుత్వం అదుకుంటుంది అని న్యాయం జరిగేలా చూస్తామని నిందుతులు ఎవరైనా వారిని వదలి పెట్టేది లేదు అని మళ్ళీ నియోజకవర్గంలో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతాను అని అధికారులకు కూడా దర్యాప్తు చేసి నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించడం జరిగినది. అమ్మాయిల పైన ఇలాంటి అగత్యాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపయోగించే ప్రత్యేక లేదని అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కచ్చితముగా చట్టం ప్రకారం శిక్ష పడక తప్పదని ఆయన హెచ్చరించారు ఇలాంటి నేరాలకు పాల్పడేవారు త్వరలోనే తగిన గుణపాఠం చెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం తీసుకువస్తుందని ఆయన తెలిపారు . కార్యక్రమంలో మండల కన్వీనర్ మహేశ్వరరెడ్డి మరియు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement