Sunday, November 24, 2024

Flood Victim – ముంపు త‌గ్గే వ‌ర‌కూ మీ బాధ్య‌త మాదే.. అచ్చెన్న, నిమ్మల

వ‌ర‌ద నిర్వాసితుల‌తో మంత్రులు అచ్చెన్న , నిమ్మ‌ల
ప్రతి కుటుంబానికి రూ. 3 వేలు అంద‌జేస్తాం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – ఏలూరు .. వరద తగ్గేవరకు అన్ని వసతులతో పునరావాస కేంద్రాలు కొనసాగుతాయ‌ని, .. వరదలు తగ్గి సొంత గ్రామాలకు వెళ్లే సమయంలో ప్రతి కుటుంబానికి 3 వేల రూపాయలు అందిస్తాం అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దాచారం గ్రామంలో నిర్వాసితులతో నేడు మరో మంత్రి నిమ్మ‌ల రామానాయుడితో క‌ల‌సి ముఖా ముఖి నిర్వహించారు మంత్రులు.. నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. . ప్రభుత్వం నుంచి అందిన సాయం గురించి కూడా అడిగారు. ఆర్ అండ్ బీ నిధులు జమ కాలేదని వారు మంత్రులకు తెలిపారు. పునరావాస కాలనీల్లో రోడ్లు, మరుగుదొడ్ల సమస్యను వివరించారు. త్వరగా బయోటాయిలెట్లు ఏర్పాటు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయంలో వరదల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ గాల్లోనే పరామర్శలు, సమీక్షలు నిర్వహించేవాళ్లు.. ప్రతిపక్షాలు వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదని విమర్శించారు.. అయితే, వరద బాధితులను ఆదుకునేందుకు కూట‌మి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు .

చంద్ర‌బాబు ఆదేశాల‌తో …

ఇక, వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు.. నలుగురు మంత్రులు ముంపు ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారన్న ఆయన.. ముంపు గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించాలని స్పష్టంగా చెప్పారన్నారు.. వరద బాధితులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఒక అడుగు ముందే ఉంటుందన్నారు.. వరద తగ్గేవరకు అన్ని వసతులతో పునరావాస కేంద్రాలు కొనసాగుతాయి.. వరదలు తగ్గి సొంత గ్రామాలకు వెళ్లే సమయంలో ప్రతి కుటుంబానికి రూ.3 వేలు అందిస్తాం అని ప్రకటించారు. వరద బాధితులకు ఎదురవుతున్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు.

జగన్ నిర్లక్ష్యంతోేనే పెద్దవాగుకు గండి

పెద్దవాగు ప్రాజెక్టుపై ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాజెక్టుకు గండిపడిందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు విమర్శించారు పీ మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు . పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడటంతో ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు చెందిన పలు గ్రామాల్లో నష్టం జరిగిందన్నారు. ఈ మండలాల పర్యటనకు మంత్రులు వెళుతూ అశ్వారావుపేటలో అగారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… 2022లోనే రెండు రాష్ట్రాల నీటిపారుదల అధికారులు నిధుల కోసం చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదన్నారు. అందుకే రైతులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ ఏడాది నుంచే రైతులకు తెలంగాణ ప్రభుత్వం నీరు అందించే ఏర్పాట్లను చేపట్టిందని, ఇందుకోసం రూ.3.5 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement