ఆంధ్రప్రభ – విజయవాడ – వర్షాల సమయంలో కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగండి అని సూచించిచారు ఎపి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. నీటినిపడి ఆ నీటిని తాగి ప్రాణాల మీదుకు తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు.. విజయవాడ యనమలకుదురులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నేడు ప్రారంభించారు..అనంతర స్ధానిక వైద్య అధికారులతో సమీక్షించారు. ప్రజారోగ్యం ప్రధాన ధ్యేయంగా ఉద్యోగులు పని చేయాలని ఆదేశించారు..
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు కూడా వీటి పై అవగాహన తెచ్చుకుని పరిసరాల శుభ్రత పాటించాలన్నారు.. మా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇక ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం లో ఆర్ధిక విధ్వంసం జరిగిందన్నారు.. అన్ని మంత్రిత్వ శాఖలు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అంటూ వైద్య రంగంలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయన్నారు.. . వీటిపై విచారణ చేసి త్వరలో చర్యలు తీసుకుంటాం అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కూడా నిధులు లేకుండా చేశారని వాపోయారు.
అంతకు ముందు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడులు జరిగాయి.. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్ పాల్గొని శ్యాం ప్రసాద్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.