Saturday, November 23, 2024

‘జగనన్న పచ్చతోరణం’.. సర్పంచ్లకు మొక్కల బాధ్యత

రాష్ట్రంలో జగనన్న పచ్చతోరణంపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఏపీ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గ్రామాలను పచ్చదనంగా మారుస్తున్నామన్నారు. గ్రామాల్లో మొక్కలను పెంచే బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగిస్తున్నామన్నారు. సర్పంచులు నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పైలట్‌ ప్రాజెక్ట్‌గా చిత్తూరు జిల్లాను ఎంపిక చేశామని పేర్కొన్నారు. జగనన్న పచ్చతోరణంతో రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేస్తామన్నారు. రైతుల కష్టాలు తనకు తెలుసని, మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నరేగా పనులపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే రూ.5లక్షలలోపు పెండింగ్‌లో ఉన్న నరేగా బిల్లులను చెల్లించామని.. మిగిలిన పనులకు విజిలెన్స్‌ నివేదిక రాగానే చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు చేసే ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement