Wednesday, January 8, 2025

AP | హెచ్‌ఎంపీవీ వైరస్‌పై వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తం !

ప్రపంచ దేశాలకు వణికుప‌ట్టించిన కరోనా వైరస్ పుట్టినిళ్లు చైనా నుంచి మరో కొత్త వైరస్ హెచ్‌ఎంపీవీ వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే చైనా, జపాన్‌లలో ఈ వైరస్‌ కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లోనూ నాలుగు కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 2, అహ్మదాబాద్‌, కోల్‌కతాలో ఒక్కో కేసు నమోదైంది.

దీంతో భారత్ అల‌ర్ట్ అయ్యింది. దేశంలో కొత్త వైరస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో హెచ్‌ఎంపీవీ వైరస్‌ వ్యాప్తిపై ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి కేసులు లేవని అధికారులు తెలిపారు. అయితే ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఇదో సాధారణ ఫ్లూ లాంటిదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అయితే, జాగ్రత్తలు తీసుకోవాలని, ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని, ఆసుపత్రుల్లో పరీక్షలు, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement