నంద్యాల బ్యూరో .. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే టిడిపి ప్రభుత్వం పని చేస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ లో వృద్ధులకు మహిళలకు వితంతువులకు నాలుగు వేల రూపాయలు పెంచిన ఘనత దక్కుతుందని, టిడిపి పార్టీలోనే అది సాధ్యమని మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ పేర్కొన్నరు. సోమవారం నంద్యాల మండలంలోని పులిమద్ది గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. జనవరి పండుగ సందర్భంగా వృద్ధులకు మహిళలకు వితంతువులకు పెన్షన్లను ఒక్క రోజు ముందుగానే పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు అని పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం భాగంగ గ్రామంలో ఇంటి వద్దకే వచ్చి, పెన్షన్ పంపిణీ చేశారు
పెన్షన్ లబ్ధి దారులతో మంత్రి మాట్లాడుతు చంద్రన్న ప్రభుత్వం ఎలా ఉంది, పెన్షన్స్ ను సకాలంలో అందుతుందా ఎంత వస్తుంది మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా,అని అడిగి తెలుసుకున్నారు. గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకపక్క అభివృద్ధితో పాటు మరోపక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మండల కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి , ఎస్ ఆర్ బి సి డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ నయాబ్ మహమ్మద్ ఫయాజ్ , అమర్నాథ్ రెడ్డి , మేకల కృష్ణారెడ్డి , పురుషోత్తం రెడ్డి , చంద్రశేఖర్ రెడ్డి , పోలూరు జోగిరెడ్డి , జేయుడు , ప్రభుత్వ అధికారులు , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.