ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్:ఏపీలో నాలుగు నెలల కిందట సంచలనం రేపిన దృశ్యం-3 మచ్చుమర్రి బాలిక గల్లంతు కేసు సీక్వెల్ టూ మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ సారి పొలిటికల్ వార్ స్క్రీన్ ప్లేతో ట్విస్టుల మీద ట్విస్టులు జనానికి నరాలు తెగే ఉత్కంఠను పంచుతుంటే.. ఏపీ భరించలేని ఉక్కిరి బిక్కిరితో ఏపీ పోలీసులు జుట్టుపీక్కునే పరిస్థితి ఏర్పడింది.
జులై 7న మచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసుతో తెరమీదకు వచ్చిన చిన్నారులపై లైంగిక దాడులు యావత్ సభ్య సమాజాన్నే కాదు.. అటు పోలీసులు, ఇటు ప్రభుత్వాన్ని అనేక నేరాలు ఘోరాలు ఇరకాటంలో పెడుతున్నాయి.
వరుస ఘటనలతో పోలీసుశాఖకు మచ్చ..విజయనగరంలో పసికందుపై ఓ వృద్ధుడి లైంగిక దాడి, చీరాల సమీపంలో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ నుంచి… బద్వేలులో యువతి సజీవ దహనం, పుంగనూరులో ఏడేళ్ల బాలిక హత్య, తాజాగా తిరుపతిలో మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం ఘటనలతో జనంలో భయాందోళన పెరుగుతోంది. ప్రతి దారుణ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందిస్తోంది. నిందితులను అరెస్టు చేస్తోంది. బాధిత కుటుంబాలకు పరిహారంతో ఊరట, ఉపశమనం కల్పిస్తోంది.
కానీ.. బాలికలు, మహిళలపై వరుస లైంగిక దాడులతో జనం బేంబేలెత్తిపోతున్నారు. దోషులను తక్షణయే కఠినంగా శిక్షించాలని డిమాండు పెరుగుతోంది, సీఎం చంద్రబాబు సైతం ఇలాంటి కిరాతకులను నడిరోడ్డుపై ఉరితీయాలని ఆగ్రహావేశం వెళ్లగక్కారు. ఇక ప్రతిపక్ష పార్టీ సైతం ప్రభుత్వం, పోలీసులపై విరుచుకు పడుతోంది. ఈ ఘటనలన్నీ రాష్ట్ర పోలీసులకు అసమర్థతను అపాదిస్తున్నాయి. వాని పనితీరుకే తీరని మచ్చ వస్తోంది.
బాధితుల తరపున న్యాయపోరాంటంనాలుగు నెల కిందట ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యం కేసు అనేక మలుపులు తిరిగింది. పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. కానీ ఆ బాలిక మృతదేహం జాడ ఇప్పటికీ లభించలేదు. నిందితులేమో తామే అత్యాచారం చేసి చంపేశామని చెప్పారు. ఆమె శవం దొరకలేదు. ఇంతకీ ఆమె చనిపోయిందా? బతికే ఉందా? అనే మీమాంశ జనాన్ని వీడలేదు.
ఈ స్థితిలో ఈ కేసును వైసీపీ అధినేత సీరియస్ గా తీసుకున్నారు. బాధితుల తరపున న్యాయపోరాటానికి రంగం సిద్ధం చేశారు. ముచ్చుమర్రికి వైసీపీ నేతలు..ముచ్చుమర్రి ఉదంతంలోని బాధిత బాలిక తల్లి దండ్రులను ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలు పరామర్శిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి, పార్టీ తరుపు ఆర్థిక సాయం చెక్కును అందజేస్తారు.
నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ దారా సుదీర్, నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ,మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకర్ రెడ్డి, ఇషాక్ భాష, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ముచ్చుమర్రికి వస్తున్నారు.
బాధిత కుటుంబానికి అండగా నిలిచే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని బైరెడ్డి సిద్దార్ధరెడ్డి పిలుపును ఇచ్చారు. ముచ్చుమర్రికి తరలిరావాలని నందికొట్కూరు నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్‌లు, వైసీపీ నాయకులను, కార్యకర్తలను ఆదేశించారు. అందరికీ అనుమతి లేదన్న పోలీసులు..బాధితురాలి తల్లిదండ్రులకు వైసీపీ తరపున రూ.10లక్షల ఆర్థిక సాయం అందించేందుకు పోలీసుల అనుమతి కోరారు. వీరిలో కేవలం ఐదుగురు నాయకులకు మాత్రమే నంద్యాల డీఎస్పీ అనుమతి ఇచ్చారు.
కేవలం బాధితులను పరామర్శించి చెక్కు అందజేయటానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు ముచ్చుమర్రి చేరటానికి వీలులేదని నాయకులకు వివరించారు.
నిందితులకు బెయిల్ మంజూరు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ముచ్చుమర్రి బాలిక హత్యాచారం కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. క్రైం నంబర్ 69/2024 కేసులో ఆరుగురిని ప్రధాన నిందితులుగా చేర్చారు. నేరం జరిగి 90 రోజులు గడవడంతో పోలీసులు ప్రిలిమనరీ చార్జిషీట్ ఫైల్ చేశారు. దీంతో నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాదనల అనంతరం కర్నూలు పోక్సో కోర్టు ఏ4 కాటం యోహాన్, ఏ5 బొల్లెద్దుల సద్గురు అలియాస్ సద్గురుడు, ఏ6 అంబటి ప్రబేష్ అలియాస్ ప్రభుఏసుకు బెయిల్ మంజూరు చేసింది.
ఇదే కేసులో ప్రధాన ముగ్గురు మైనర్ నిందితుల్లో ఇద్దరికి జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. చైల్డ్ ఇన్ కాంఫ్లిట్ విత్ లా(సీసీఎల్2)14 ఏళ్ల బాలుడు, సీసీఎల్3 అయిన తొమ్మిదేళ్ల బాలుడికి బెయిల్ మంజూరైంది. సీసీఎల్1 పదిహేనేళ్ల బాలుడు ప్రస్తుతం జువైనల్ జస్టిస్ హోంలో ఉన్నాడు.